Andhra yuvasankalp 2025:
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతీ యువకుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక కొత్తగా క్యాంపెయిన్ తీసుకొచ్చారు.ఇందులో భాగంగా మీరు ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ రియల్ కానీ యూట్యూబ్ షార్ట్ కానీ పెట్టవలసి ఉంటుంది. క్వాలిఫికేషన్ తో నిమిత్తం లేకుండా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఏ విభాగాల అభివృద్ధి చెందుతుంది అనే దానికి సంబంధించి మనకు మొత్తం మూడు కేటగిరీలు ఇచ్చారు. ఆ మూడు క్యాటగిరిలలో మీరు ఒక కేటగిరీ తీసుకోవాల్సి ఉంటుంది. దాని పైన మీరు ఒక యూట్యూబ్ షార్ట్ లేదా ఇంస్టాగ్రామ్ రియల్ కానీ మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయాలి.
ఇందులో సెలెక్ట్ అయిన వారందరికీ ఫస్ట్ ప్రైస్ లక్ష రూపాయలు అలాగే రెండవ మూడవ ప్రైస్ కూడా ఉన్నాయి 75000, 50000 అలా ఇవ్వడం జరుగుతుంది.అంతేకాకుండా ఒక తొమ్మిది మందిని కూడా బ్రాండ్ అంబాసిడర్ విభాగంలో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.
దీనికి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. ఊరికే మీరు జస్ట్ ఒక వీడియో అనేది రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలి.
మీరు రికార్డ్ చేసేటప్పుడు కచ్చితంగా 120 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అందులో ఇచ్చిన క్యాటగిరీని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు ఇచ్చినటువంటి హాష్ టాక్స్ అన్నీ కూడా సక్రమంగా పెట్టుకోవాలి.. ఆ వివరాలన్నీ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది ఆ స్టెప్స్ అన్నీ కూడా ప్రాపర్ గా ఫాలో అయితే సరిపోతుంది.
దీనికి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా సంబంధం లేదు.. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందా వాళ్ళందరూ కూడా హ్యాపీగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు.. మీరు జస్ట్ సెలెక్ట్ అవ్వకపోయినా జస్ట్ పాటిస్పేట్ చేసినా కూడా మీకు ఒక సర్టిఫికెట్ అనేది ఇస్తున్నారు కాబట్టి అవకాశం ఉంటే యూస్ చేసుకుని ప్రయత్నం చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.