AP Jobs Calendar Good News:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో వేకెన్సీస్ తో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి యువతీ యువకులు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించే దిశలో ముందుకు వెళ్తామని గతంలో కూడా హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి లక్ష పైగానే వేకెన్సీస్ ని భర్తీ చేసే దిశగా ప్రభుత్వం ముందడుగులు వేస్తూ ఉంది.

జనవరి నెలలో లక్ష ఉద్యోగాలతో మెగా జాబ్స్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు అధికారిక వర్గాలు చెప్పడంతో పాటు నారా లోకేష్ గారు రాజమండ్రిలో జరిగినటువంటి సమావేశంలో విద్యార్థులు జరిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెబుతూ కచ్చితంగా జాబ్ కాలండర్ విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
నూతన సంవత్సరం గిఫ్ట్ గా మనకు ఈ యొక్క సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మనకు ఏ విభాగంలో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి వాటి అంశాలు అన్నీ కూడా సేకరించి ఆ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి పోర్టల్ లో ప్రభుత్వ నమోదు కూడా చేయడం జరిగింది.
ఇప్పటివరకు చూసుకున్నట్లయితే అన్ని శాఖల్లో కూడా కలుపుకుంటే 30% వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాలు వేస్తూ ఉన్నారు. 157 విభాగాలలో మనకు ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖాళీలు వివరాలను పోర్టల్ లో నమోదు చేసినట్లు అధికారి వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి.
ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి?
ఈ యొక్క మెగా జాబు క్యాలెండర్ ద్వారా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు దాదాపుగా ఒక లక్షకు పైగానే ఉన్నట్లు అంచనాలు వేస్తూ ఉన్నారు.
అత్యధికంగా ఖాళీలు అనేవి మనకి మునిసిపాలు పట్టణాభివృద్ధి రెవెన్యూ విద్యాశాఖ పరిధిలో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఆర్థిక శాఖ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఆధారంగా చూసుకున్నట్లయితే గనుక మూడు శాఖల పరిధిలో 47 వేలకు పైగానే వేకెన్సీస్ అయితే ఉన్నట్లు అంచనాలు వేస్తూ ఉన్నారు.
పట్టణ అభివృద్ధి మరియు పురపాలక విభాగంలో దాదాపుగా 27 వేలకు పైగానే వేకెన్సీస్ ఉన్నాయి. డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా 23 వేల పోస్టులు విడుదల చేస్తారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4 వేల పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత విద్యలో 7000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరియు విశ్వవిద్యాలయాలు 3000 వరకు వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. వ్యవసాయ శాఖలో చూసుకున్నట్లయితే 3 వేలకు పైగానే ఖాళీలు ఉన్నాయి.
పంచాయతీరాజ్ వంటి విభాగాలలో దాదాపు 26 వేలకు పైగానే ఖాళీలు ఉన్నట్లు అంచనాలు వేస్తూ. ప్రజారాజ్యం కుటుంబ సంక్షేమ విభాగాలలో దాదాపు పదివేల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా విభాగాలలో వేకెన్సీస్ కూడా ఉన్నాయి అన్ని కలుపుకుంటే దాదాపు ఒక లక్ష వరకు వేకెన్సీస్ ఉన్న ఉన్నాయి. అయితే మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా మొదట విడతలో ఎన్ని వేకెన్సీస్ అనే విడుదల చేస్తున్నారో జనవరి సంక్రాంతికి మనకు తెలుస్తుంది.