AP 10th Class Exams Timetable 2026:
ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన పరీక్షా తేదీలనేవి విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పబ్లిక్ పరీక్షలు మనకు మార్చ్ 16వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్లో టెన్త్ పరీక్షలకు సంబంధించి మనకు మార్చ్ 16వ తేదీ నుంచి నిర్వహిస్తారు అని చెప్పి విద్యాశాఖ ప్రస్తుతానికి సిద్ధమయింది. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఒక 30 రోజులు అంటే ఒక నెల రోజులు పాటు ఫీజులు మనం కట్టుకోవచ్చు. అయితే ఈసారి సరికొత్తగా మళ్లీ మనకి హాల్ టికెట్స్ వెనక QR CODE కూడా ఇవ్వనున్నట్లు విద్యాశాఖ చెప్తుంది. అయితే స్టూడెంట్స్ అందరూ కూడా ఆ యొక్క క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేసి పరీక్ష కేంద్రం రూట్ మ్యాప్ అనేది మీకు కనిపిస్తుంది అని చెప్పి విద్యాశాఖ క్లియర్ గా చెప్తుంది.
అయితే కొంతమంది స్టూడెంట్స్ అంతా చదివినా కూడా వెనకబడి ఉంటారు అటువంటి స్టూడెంట్స్ కోసం ఈసారి 100 రోజుల ప్రణాళిక డిసెంబర్ నెల నుంచి కూడా అమలు చేయబోతున్నారు.
అంటే పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ప్రస్తుతం ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగు నెలల పాటు సమయం ఇవ్వడం జరిగింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాపర్ ప్లానింగ్ తో చదువుకున్నట్లయితే కచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గతంలో అడుగునటువంటి ప్రశ్నాపత్రాలు కావచ్చు లేదంటే ప్రస్తుతం పెడుతున్నటువంటి డైలీ టెస్ట్ లో వీక్లీ టెస్ట్ లో గ్రాండ్ టెస్ట్ లు అన్నీ కూడా ప్రాపర్ గా ప్లానింగ్ ప్రకారం క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే కనక విజయం సాధించడం జరుగుతుంది.
ఈ పరీక్షలు రాస్తే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. రాసేటప్పుడు కూడా చాలా నీట్ హ్యాండ్ రైటింగ్ ఉన్నట్లయితే పేపర్ కరెక్షన్ చేసే వారికి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం మాత్రమే రాయాలి మరియు ఎంత అవసరమో అంతవరకు రాస్తే సరిపోతుంది.