International Yoga Day:
International Yoga Day – యోగా అనేది ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ యోగ డే సందర్భంగా మన విశాఖపట్నంలో జరిగే యోగా ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా ప్రధాని మోదీ సందర్శిస్తున్నారు. యోగా సంఘం 2025 పేరుతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ యొక్క యోగ సంబంధించినటువంటి కార్యక్రమం మొత్తం కూడా చేస్తుంది.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన భారత దేశంలో లక్షకు పైగా వేదికలు కొన్ని లక్షల మంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా తరలి వెళ్లి యోగా అనేది చేస్తున్నారు. అయితే ఈ యొక్క యోగాకు సంబంధించిన టీం విషయానికి వచ్చినట్లయితే “ ఒక భూమి.. ఒక ఆరోగ్యం”
ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ కూడా కొన్ని యోగాసనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం దీనికిగాను విశాఖపట్నం అంతా కూడా ముస్తాబయింది అని చెప్పాలి.
రాగల 4 రోజులు భారీ వర్షాలు జాగ్రత్త
ఈ యోగాంధ్రా కార్యక్రమం విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ ప్రాంగణం నుంచి మొదలుకొని దాదాపు 26 కిలోమీటర్లు అంటే భోగాపురం వరకు కూడా యోగ కారిడార్ అనేది ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి దాదాపుగా దేశం నలుమూలల నుంచి దగ్గర దగ్గర 3 లక్షలకు పైగానే జనాలు తరలివచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నట్లు కనబడుతుంది. దీనికి సంబంధించి కచ్చితంగా ప్రపంచ రికార్డు మరియు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈ వేడుక అనేది పేరుగాంచి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ యొక్క అంతర్జాతీయ యోగా దేని సందర్శించుకొని యోగ డే పోస్టల్ స్టాంప్ ను కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ మరియు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.17 కోట్ల మంది ఒకేసారి యోగా చేస్తున్నారని విశాఖపట్నం ఒక్కటే చూసుకుంటే దగ్గర దగ్గర 3 లక్షల మందికి పైగా ఇక్కడ యోగా అనేది నిర్వహించి దీనికి సంబంధించిన ప్రపంచ రికార్డు వచ్చే విధంగా చూస్తున్నట్లు కూడా కనపడుతుంది.
ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మోడీతో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ కూడా తరలివచ్చారు.
మొత్తానికి ఈరోజు జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం – International Yoga Day ఘనంగా విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.