KVS NVS Vacancies Update 2025:
కేంద్రీయ విద్యాలయం మరియు నవోదయ విద్యాలయ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో మొత్తంగా మనకు టీచింగ్ విభాగంలో 13025 మరియు నాన్ టీచింగ్ విభాగంలో 1942 పోస్టులు విడుదల చేసిన సంఘటన మీ అందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు విషయం ఏంటంటే గనక ఈ జాబ్స్ కి కొంత మంది అప్లై చేసుకోలేదు అటువంటి వాళ్ళకి శుభవార్త. ఎందుకంటే గతంలో మనకు డిసెంబర్ 4వ తేదీ వరకు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అయితే డిసెంబర్ 4వ తేదీన సర్వర్ అనేది డౌన్ అయిపోవడం వల్ల చాలా మంది అప్లై చేసుకోలేకపోయారు. అటువంటి వారందరికీ కూడా మరొక అవకాశం కల్పిస్తూ డిసెంబర్ 11 వరకు కూడా చివరి తేదీ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది.
కనీసం 10th, 12th, Deree, B. Ed, D. Ed అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా మీరు నాన్ టీచింగ్ మరియు టీచింగ్ విభాగాలలో ఉన్న పోస్టులకు మీరు అప్లై చేయొచ్చు.
వీడికి సంబంధించి మీకు జీతాలు కూడా 80 వేలకు పైగానే ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి చక్కటి అవకాశం గా చెప్పవచ్చు. తాజాగా రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ ప్రకారం చూసినట్లయితే మనకు డిసెంబర్ 11 వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో పెట్టుకోవచ్చు.
వీటికి సంబంధించిన Tier 1 పరీక్ష Jan 10th, 11th తేదీలలో మీకు నిర్వహించడం అయితే జరుగుతుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.