4 రోజులు 7 పుణ్యక్షేత్రాలు:
APSRTC Tour – ఒడిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ్ రథయాత్రకు వెళ్లాలి అనుకునే భక్తులు యొక్క సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని రాజమండ్రి నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా భక్తుల్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వివరాలు విశేషాలు ఏంటో చూద్దామా..
ఒడిశాలో జరుగుతున్న పూరి జగన్నాథ్ రథయాత్రకు వెళ్లాలి అనుకునే భక్తుల కోసం రాజమండ్రి నుంచి పూరి వరకు APSRTC Tour ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల యొక్క టైమింగ్స్ ఒకసారి మనం గమనిస్తే ఈనెల అనగా జూన్ 25 సాయంత్రం ఐదు గంటలకి ఆర్టీసీ బస్టాండ్ రాజమండ్రి నుంచి ఈ బస్సు బయలుదేరుతుంది. ఈ యాత్ర దాదాపు నాలుగు రోజులు పాటు జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ బస్సు యాత్రలో భాగంగా మొత్తం ఏడు పుణ్యక్షేత్రాన్ని మీరు సందర్శించవచ్చు. ఇవన్నీ కూడా లగ్జరీ బస్సులు కాబట్టి మీరు హ్యాపీగా సౌకర్యవంతంగా ప్రయాణం చేసుకోవచ్చు.. ఇందులో టీవీ సౌకర్యం కూడా ఉంటుంది.
ఒక APSRTC Tour బస్సు కంప్లీట్ గా ఫుల్ అయిపోతే ఇంకో బస్సు కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు.
అన్ని బైక్స్ కి ఏబిఎస్ తప్పనిసరి
APSRTC Tour – 7 క్షేత్రాలు ఏంటి?
పూరి జగన్నాథ్ రథయాత్రకు సంబంధించి భక్తులు ఏడు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విసులుపాటించారు. వాటిలో భాగంగా విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి సింహాచలంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వారసవల్లిలో ఉన్నటువంటి సూర్య భగవాన్ ఆలయం, శ్రీకూర్మం మరియు భువనేశ్వర్లో లింగరాజు స్వామి సాక్షి గోపాల్ లో వేణుగోపాలస్వామి కోణార్క్ పూరీలో జగన్నాథ స్వామి ఆలయాలను మీరు దర్శించుకోవచ్చు.
టికెట్ ఎంత ?
భక్తులకు సౌకర్యార్థం టికెట్ దారిని చాలా తక్కువ పెట్టారు. ఒక్కొక్క మనిషికి ₹3,500 టికెట్ ధరగా పెట్టడం జరిగింది. అయితే మిగతా ఏవైతే టికెట్ ఖర్చులు కావచ్చు ఇంటి ఖర్చులు కావచ్చు విశ్రాంతి గదులు ఖర్చు కావచ్చు మొత్తం భక్తులు మాత్రమే పెట్టుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.