AP Police Notification Update 2025:
ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడే అధికారికంగా మనకు త్వరలో విడుదల కాబోయే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలనేవి మెమోరాండం విడుదల చేయడం జరిగింది.
ఇందులో భాగంగానే మనకు పదివేలకు పైగానే వేకెన్సీస్ అనేవి విడుదల చేస్తున్నారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అంటే ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు కాని ఒక రెండు నుంచి మూడు నెలలు సమయం పట్టి అవకాశం అయితే ఉంది కావున ఆప్యాయతలు ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతాము అనుకుంటున్నారు మీ యొక్క ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకుంటే గనక కచ్చితంగా మీరు విజయం సాధించలేరు.
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు Inter, Diploma/ Any Degree అర్హతలు తప్పనిసరిగా అయితే ఉండాలి. దీనికి సంబంధించి మీకు 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు ఎవరికైతే ఉందా వారందరూ కూడా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.. అయితే దీనికి సెలక్షన్లో ముందు మీకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ మరియు ఫిజికల్ ఈవెంట్స్ అయితే ఉంటాయి.. ఈ యొక్క ఫిజికల్ ఈవెంట్స్ లో మీకు 1600 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు మెయిన్స్ పరీక్ష అనేది ఉంటుంది ఆ తర్వాత డైరెక్ట్ గా సెలెక్షన్ చేసి ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయితే మీకు 30 వేలకు పైగానే జీతం అనేది పొందవచ్చు మరియు చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది ఎందుకంటే మనకు క్వాలిఫికేషన్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు దీనికి సంబంధించి అన్ని విభాగాల వారికి అవకాశం ఇవ్వట్లేదు కొన్ని పర్టికులర్ బ్రాంచీలు వారికి మాత్రమే మీకు అవకాశం ఇస్తున్నారు కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది.
అయితే జనవరిలో కూడా మీకు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడానికి ఏపీ గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉంది కావున ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు మాత్రం కచ్చితంగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి విజయం మీదే అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్లై తేదీలు కానీ మిగతా వివరాలు కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.