Talliki Vandanam Update 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Talliki Vandanam Update 2025 ద్వారా అర్హులైన వారికి 13 వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. దీనిలో భాగంగా చాలామందికి డబ్బులు క్రెడిట్ అయ్యాయి. అయితే కొంతమందికి ఈ 13 వేల రూపాయలు క్రెడిట్ అవ్వలేదు. క్రెడిట్ అవ్వని వారు ఈ ప్రాసెస్ ని ఫాలో అయినట్లయితే మీకు ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాది. ఆ వివరాలు కంప్లీట్ గా మనం చూద్దాం.
👉గ్రీవెన్స్ ఫారం ఎవరికి అవసరం:
13000 ఎవరికైతే క్రెడిట్ అవ్వలేదు వాళ్ళందరూ గ్రీవెన్స్ ఫారం నింపి మీ యొక్క గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే మీకు 5 రోజుల్లో డబ్బు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది.
తల్లికి వందనం పథకానికి మీరు అర్హులై ఉండి మీకు ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వకపోతే కచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవ్వాలి
తల్లికి వందనం అప్లికేషన్ ని ఎవరైతే అప్లై చేశారో మరియు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్మిట్ అనేది చేయొచ్చు
ఒకవేళ మీ యొక్క ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబర్ లేదా రేషన్ కార్డు లింకింగ్ లో ఏదైనా సమస్య తలెత్తినట్లయితే అప్పుడు మీరు కచ్చితంగా ఈ ఫారం నింపి మీరు సచివాలయంలో సబ్మిట్ చేయాలి
👉 గ్రామ సచివాలయంలో ఎలా సబ్మిట్ చేయాలి:
అప్లికేషన్ పేరేంటి – తల్లికి వందనం సంబంధించిన గ్రీవెన్స్ ఫారం
ఈ గ్రీవెన్స్ ఫారం ఎక్కడి నుంచి పొందవచ్చు – మీకు సంబంధించిన గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఈ ఫారం ని తెచ్చుకోవచ్చు
👉గ్రీవెన్స్ ఫారం ఏ విధంగా సబ్మిట్ చేయాలి:
- గ్రామ వార్డు సచివాలయం కు సంబంధించినటువంటి పేరు మరియు సచివాలయం కోడ్
- మీ మండలం మరియు జిల్లాకు సంబంధించిన పూర్తి పేరు
- మీ సంతకం కచ్చితంగా పెట్టాలి మరియు మీ పేరు కూడా పూర్తిగా రాయాలి ఇంటిపేరుతో సహా
- గ్రీవెన్స్ రాకంలో మీకు డబ్బు ఏ విధంగా క్రెడిట్ అవ్వలేదో మీరు వివరంగా నమోదు చేయాలి
- మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి
- ఆధార్ కార్డు మీ పిల్లలకు సంబంధించిన నెంబర్ ఉంటుంది దాన్ని కూడా పెట్టాలి
- స్కూల్ రికార్డు ఆధారంగా చేసుకొని పిల్లలు యొక్క ఐడి ప్రూఫ్
- మీ యొక్క బియ్యం కార్డు నెంబరు
- మీ క్యాస్ట్ సర్టిఫికెట్
👉ఇతర డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి:
- పిల్లల యొక్క తల్లి యొక్క ఆధార్ జిరాక్స్ కాపీ
- డబ్బు క్రెడిట్ కాలేని పిల్ల వారి యొక్క ఆధార్ కార్డు యొక్క జిరాక్స్
- సంబంధిత లబ్ధిదారుని యొక్క రేషన్ కార్డు యొక్క జిరాక్స్
- పిల్లవాడు యొక్క ఐడి ప్రూఫ్
- బ్యాంకు యొక్క పాస్ బుక్ జిరాక్స్ కాపీ మొదటి పేజీ ఉంటే సరిపోతుంది
👉ఎన్ని రోజుల్లో డబ్బు బ్యాంకులో పడతాయి:
ఈ గ్రీవెన్స్ ఫారం నింపి సంబంధిత సర్టిఫికెట్లని అటాచ్ చేసి సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే అప్లై చేసిన 5 రోజుల్లోనే మీకు డబ్బులు అనేవి క్రెడిట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.