APSRTC Recruitment 2026:
APSRTC – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భారీ మొత్తంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా మొత్తం మనకు 7673 రెగ్యులర్ ఉద్యోగాలకు సంబంధించిన అనుమతులైతే రావాల్సి ఉంది అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఇందిరా భాగంగా మనకు 3673 డ్రైవర్ ఉద్యోగాలతో పాటు 1813 కండక్టర్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటి కథనంగా మళ్ళీ మనకి డిపోలలో పనిచేయడానికి సంబంధించి మెకానిక్ శ్రామిక్ వాటి జాబ్స్ కూడా అదనంగా సాంకేతిక విభాగాల్లో పని చేయడానికి సంబంధించి నియామకాలు చేపట్టడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని ఛాన్స్ కూడా ఉంటుంది. వీటికి సంబంధించి ఒక ఎగ్జాం కూడా పెడతారు అలాగే డ్రైవర్ లాంటి జాబ్స్ కి స్కిల్ టెస్ట్ కూడా పెడతారు. ఒకవేళ క్వాలిఫై అయితే అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
₹30,000/- వరకు కూడా నెలవారీ మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన అసలు మనకు నోటిఫికేషన్ ఎంత త్వరగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే గనక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసిన స్త్రీ శక్తి అనేటటువంటి పథకం ఆధారంగా చాలామందికి ప్రయాణికుల రద్దీ అనేది ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి దానిని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క డ్రైవర్ మరియు కండక్టర్ తో పాటు సాంకేతిక విభాగంలో పనిచేయడానికి చాలా స్టాప్ ని రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి డ్రైవర్ మరియు కండక్టర్ల పైన పని భారం బాగా ఎక్కువగా అయిపోతుంది కాబట్టి నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా ఆన్ కాల్ ప్రాతిపదికన పని చేసేటటువంటి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకి 800 రూపాయల నుంచి వేయి రూపాయలకు ఈ యొక్క జీతం అనేది ప్రతిరోజు పెంచడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు.
ప్రస్తుతానికి ఇంకా నోటిఫికేషన్ మాత్రం రాలేదు కానీ త్వరలోనే వస్తుందని చెప్పి ఏపీఎస్ఆర్టీసీ క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది.