AP SSC Exam Results 2026 Date :
AP లో పదవ తరగతికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫలితాలపై ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. May 1st week లోనే ఫలితాలు అనేవి విడుదల అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.
యాక్చువల్ గా ఏప్రిల్ ఎండింగ్ కి ఫలితాలు అనేవి విడుదల చేస్తామనే గతంలో తెలియచేసినప్పటికీ కూడా కొన్ని నివారణ కారణాలు మరియు మార్కుల ప్రాసెసింగ్ ప్రక్రియ అనేది కొంచెం టైం తీసుకుంటుంది కావున మేము మొదటి వారంలో ఎప్పుడైనా కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు కొత్త అప్డేట్ అయితే వచ్చింది. మరి పదవ తరగతి విద్యార్థులు అందరూ కూడా ఫలితాలు అనేవి విడుదలైన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు అనేవి మొన్న ఏప్రిల్ 3rd తేదీకి కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక మనకు మొత్తం 99.05% హాజరు శాతం కూడా నమోదు కావడం జరిగింది. ఏప్రిల్ 15 నాటికి మనకు ఆన్సర్ పేపర్ యొక్క మూల్యాంకన ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మారుకుల ప్రాసెసింగ్ అనేది చేయాలి అంటే వెబ్సైట్లో మీ యొక్క మార్కులు అన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడానికి దాదాపుగా ఒక పది రోజులు పాటు సమయం పట్టే అవకాశాలు ఉంటాయని చెప్పి అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి.
విద్యార్థులందరూ కూడా మీరు మరికొన్ని రోజులు పాటు వెయిట్ చేయడం కచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఫలితాలు విడుదలప్పుడు తొందరపడకుండా నిదానంగా మీరు ఫలితాలు అన్నీ కూడా ఆన్లైన్లోనే ఇంటి నుంచి చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
How to Check SSC Results :
BSEAP అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ రిజల్ట్స్ కనబడుతాయి అక్కడ మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ ద్వారా మీ ఫలితాలు యొక్క పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు.
9552300009 MANA MITRA సంబంధించి వాట్స్అప్ సర్వీస్ అనేది కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. మీరు ఇందులోకి వెళ్ళిన తర్వాత హాయ్ అని చెప్పేసి పంపించినట్లయితే మీరు ఒక మెసేజ్ అనేది కనిపిస్తుంది మీకు అక్కడ. EDUCATION SERVICE – SSC RESULTS – ROLL NO. – CONFIRM అనే ఆప్షన్స్ అనేవి క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఫలితాలు యొక్క పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరు కావాలంటే మీ యొక్క ఫలితాలు సంబంధించి పిడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.