AP 10th Results Out 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు అనేవి రేపు అనగా ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయడానికి మంత్రి లోకేష్ గారు అధికారికంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది.
X అనగా ట్విట్టర్ వేదికగా మనకు ఈ యొక్క ఫలితాలైతే విడుదల చేస్తున్నామని చెప్పి విద్య మరియు ఐటి శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ అధికారికంగా చెప్పాడు.
అయితే ఈ ఏడాది మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు కూడా పదవ తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షలు అనేవి జరిగాయి. దీనికి గాను 6.30 లక్షల మంది ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది.
అంటే ఇప్పుడు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫలితాలు అనేవి ఏప్రిల్ 30 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఎప్పుడైనా కూడా విడుదల అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
టెన్త్ ఫలితాలు ఎలా చెక్ చేయాలి:
- ముందుగా మీరు అఫీషియల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి – BSEAP
- Hall Ticket నెంబర్ మరియు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫీల్ చేసి సబ్మిట్ చేయండి
- Results డిస్ప్లే అవుతాయి చెక్ చేయొచ్చు
- మీరు డౌన్లోడ్ చేసుకొని ఆప్షన్ ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు