AP DSC Vacancies 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు డీఎస్సీ నోటిఫికేషన్ అక్టోబర్ 15వ తేదీన విడుదలవుతున్న విషయం మనకు స్పష్టం అయిపోయింది.
అయితే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఈసారి మనకి వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి అని చెప్పేసి. అయితే కొన్ని జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.
డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు డీఎస్సీ నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తామని చెప్పి విద్యాశాఖ అధికారులు క్లియర్ గా అనౌన్స్ చేయడం జరిగింది.
డీఎస్సీ లో ఎన్ని పోస్టులు విడుదల చేస్తున్నారు?
మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ ద్వారా మొత్తంగా 2250 పోస్టులనేవి రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటి అంటే డైట్ ఎన్సీఈఆర్టీ గ్రంథాలయాలలో సిబ్బంది ఇది కూడా మనకు రిలీజ్ చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు మరియు ఆదర్శ పాఠశాలలతో పాటుగా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు దివ్యంగా మరియు బీసీ సంక్షేమ విద్యా సంస్థలలో టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ కలుపుకుంటే 2500 పైగానే వేకెన్సీస్ కి నోటిఫికేషన్ అనేది వస్తుందని అంచనా వేస్తున్నారు.
.Teachers – 2250
డైట్,NCERT లెక్చరర్స్ – 160
జూనియర్ లెక్చరర్స్ – 209
లైబ్రరీయన్ – 100 సుమారుగా ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.
ప్రతి ఏటా డిఎస్సి :
పాఠశాల విద్యాశాఖ ప్రతి ఏటా కూడా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఉద్దేశంతో 2029 వరకు కూడా ప్రతి ఏటా కూడా ఉన్నటువంటి ఖాళీ వేకెన్సీ అన్ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఉన్న వేకెన్సీస్ లో భాగంగా 70 శాతం ప్రమోషన్స్ ద్వారా మరియు మిగతా 30% డైరెక్ట్‌గా నియామకాల ద్వారా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. 2026 తో పాటుగా 2027 28 29 సంవత్సరాలలో వరుసగా నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు.
జిల్లాలలో వేకెన్సీస్ అంచనా :
కాకినాడ – SGT 23, School assistant 121
Konaseema SGT 28, School assistant 108
East Godavari SGT 9, School assistant 104
Ananthapuram : SGT 169, school assistant 169